టిడిపి లో భారీ చేరికలు



ఎమ్మిగనూరు పట్టణంలోని 12వ వార్డు, 9 వ వార్డులకు చెందిన YCP, జనసేన పార్టీలకు చెందిన ఉసేనప్ప నాయుడు, శ్రీనివాసులు నాయుడు,  రియాజ్, రసూల్, పరమేష్, వీరేష్, రాజు, వెంకటేష్, దుర్గా, మహేష్, సుందర్ రాజు, ఇక్బాల్, రహిమాన మరియు వారి అనుచరులు సుమారు 100 మంది  యువకులు 12వ వార్డు టిడిపి అధ్యక్షులు అల్తాఫ్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బి వి జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో టిడిపి పార్టీలోకి చేరినారు. 



ఈ సంద్భంగా వీరు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణ అని పేరు ఉండేదని కానీ YCP పార్టీ తుగ్లక్ ముఖ్యమంత్రి హయాంలో ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని పేర్కొన్నారు. ఇటీవల టిడిపి - జనసేన ఉమ్మడి పార్టీలు ప్రకటించిన సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సంద్భంగా వీరికి టిడిపి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.