కామ్రేడ్ అప్పల నరస కు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..



 అల్లూరిసితారామరాజు జిల్లా, అరకు వేలి నియోజకవర్గం లో ఈ 2024వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అరకు పార్లమెంట్ పరిధిలో ఇండియా కూటమి సిపిఐ.ఎం ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పలనరస నిన్న అనగా తేదీ 26.04.2024న సాయంకాలము 5 గంటల సమయంలో అరకు వేలి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విచ్చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర చైర్ పర్సన్ శ్రీమతి పాచిపెంట శాంతకుమారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానుల సమక్షంలో మంగళ హారతి ఇచ్చి వారికి ఘన స్వాగతం పలికారు. 



దుసాలువలతో సన్మానించి  పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పలనరస భారీ మెజారిటీతో విజయం సాధించాలని శ్రీమతి పాచిపెంట శాంతకుమారి మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆశీర్వదించడం జరిగింది. ఆదివాసీ ఉద్యమ నేత కామ్రేడ్ అప్పలనరస ని అరకు ఎంపీ గా గెలిపిద్దాం. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓటు. అంటూ ప్రతి ఒక్కరూ నినాదాలు చేశారు.