ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలంలోని తురువగల్లు, తొగ లుగల్లు, యాటకల్లు, బిల్లేకల్లు, వెంగళాయిదొడ్డి గ్రామాల్లో పర్యటించిన కర్నూల్ జిల్లా జేసీయస్ కో ఆర్డినేటర్, వైస్సార్సీపీ ఆలూరు అసెంబ్లీ అబ్జర్వర్ తెర్నకల్ సురేంద్రరెడ్డి. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి మాట్లాడుతు గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకో వాలని వైఎస్సార్సీపీ ఆలూరు నియోజకవర్గ పరిశీలకుడు తెర్నేకల్ సురేందర్ రెడ్డి అన్నారు.
వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం లో ఆయన మాట్లాడుతూ పార్టీ విజయానికి నాయకులు, కార్య కర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు , వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి బుసినె విరుపాక్షిని గారిని ఎంపీ అభ్యర్థి బి వై రామయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు పార్టీ నాయకులు పెద్దయ్య, పెద్దరెడ్డి, లక్ష్మన్న, హనుమం తురెడ్డి, రామిరెడ్డి, వెంకటరెడ్డి, ఈరన్న, రంగన్న _ వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.