శ్రీకాళహస్తి లో రౌడీజం లేకుండా చేస్తా

శ్రీకాళహస్తి లో రౌడీజం లేకుండా చేస్తా : బొజ్జల సుధీర్ రెడ్డి.



ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణం 9,10,12 వ వార్డు ల నందు ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ - జనసేన -బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.



వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్ధించారు. బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటింటి ప్రచారానికి 9,10,12 వ వార్డు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.



అదేవిదంగా నారా చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. 



ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, క్లస్టర్ మిన్నల్ రవి, కాసరం రమేష్, కరీం, సుప్రజ,CS మాస్తాన్, మునంద్ర, ఫకృదిన్, ఊహ, వివేక్, రాకేష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నరు