అనకాపల్లి జిల్లా పోలీసు: కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ లో సరైన ధ్రువపత్రాలు లేని 57 వాహనాలను సీజ్ చేసిన దేవరపల్లి పోలీసులు.
అనకాపల్లి, మే 24: జిల్లా ఎస్పీ శ్రీ కే.వీ.మురళీకృష్ణ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు అనకాపల్లి సబ్ డివిజన్, కే కోటపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సిహెచ్. స్వామి నాయుడు ఆధ్వర్యంలో ఎస్సై డి.నాగేంద్ర మరియు అనకాపల్లి సబ్ డివిజన్ పోలీసు సిబ్బందితో దేవరపల్లి మండలం, ఎస్సీ కాలనీ, గొల్ల వీధి, మరియు గాలి వీధి కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు మొత్తం 57 వాహనాలను స్వాధీనం చేసుకున్న దేవరపల్లి పోలీసులు.
ఈ సందర్భంగా అధికారులు సంబంధిత గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అలాగే అనుమానస్పద ప్రాంతాల్లో ఈ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎటువంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనరాదని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.