బ్రౌన్‌ గ్రంథాలయానికి జి.లక్ష్మీ నరసింహ ప్రసాద్‌ 60 పుస్తకాలు బహూకరణ



అనంతపురం ప్రభుత్వ పురుషుల కళాశాల జంతుశాస్త్ర విభాగం అధ్యక్షులు జి.లక్ష్మీ నరసింహ ప్రసాద్‌, కడప ఎస్‌.కె.ఆర్‌ అండ్‌ ఎస్‌.కె.ఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డా॥ వి.సలీం బాషా, అనంతపురం ప్రభుత్వ పురుషుల కళాశాల ఇంగ్లీషు లెక్చరర్‌ ఎస్‌.ఇ.అహ్మద్‌, తంగేడుకుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆర్‌.మనోహర్‌ నాయక్‌లతో కలసి సోమవారం 60 పుస్తకాలను సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలోని గ్రంథాలయ సహాయకులు జి.హరిభూషణరావు, సహాయ పరిశోధకులు డా॥ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రిలకు అందజేశారు. ఈ సందర్భంగా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య తప్పెట రామప్రసాద రెడ్డి మాట్లాడుతూ జి.లక్ష్మీ నరసింహ ప్రసాద్‌ బహూకరించిన అమూల్యమైన గ్రంథాల్లో సంస్కృత మహాభారతం (6 భాగాలు), నా కోరా రాతలు, భాగవత సప్తాహం, ముగ్గురు సుందరుల కథ (సుందరకాండ రహస్యాలు), శ్రీదేశిక ప్రబంధమ్‌, పునర్జన్మ ఉన్నట్టా, లేనట్టా?, వేదములు, కుట్ర, శ్రీ సద్గురు రచనా వైభవం, నా జీవన యానం, పరతత్త్వ పరిశోధన, పెన్నేటిపాట, దశావతారాలు, శ్రీవిష్ణుపాదాది కేశాంత స్తోత్రమ్‌ తదితర గ్రంథాలున్నాయన్నారు. గ్రంథాలయానికి పుస్తకాలను బహూకరించిన జి.లక్ష్మీ నరసింహ ప్రసాద్‌ను యోగివేమన విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ ఆచార్య చింతా సుధాకర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య అభినందించారు.