భారీగా పోస్టల్ బ్యాలెట్లు.. కౌంటింగ్ ఆలస్యమే!

 


ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ దఫా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లే ఇందుకు కారణం. 2019లో 2.62లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటే ఈసారి ఆ సంఖ్య 4.97 లక్షలుగా ఉంది. వీటి లెక్కింపునకు సుదీర్ఘ సమయం పడుతుంది. పైగా వీటి తర్వాతే ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. జూన్ 4న ఉ.8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. 10గంటల తర్వాతే ట్రెండ్ తెలిసే పరిస్థితులున్నాయి...