అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు, శివకోటి గ్రామాలలో గురువారం రాజోలు నియోజకవర్గ జనసేన అభ్యర్ధి దేవ వరప్రసాద్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టిడిపి మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు.
అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి అభ్యర్ధి గంటి హరీష్ బాలయోగి గారికి 'సైకిల్' గుర్తు పైన, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్ధి దేవ వరప్రసాద్ కి 'గాజుగ్లాసు' గుర్తు పైన ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని సతీష్ బాబు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో రాజోలు ఎంపిపి కేతా శ్రీనివాస్, మండల టిడిపి అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.