మే 19. 20. 21 తేదీలలో రక్తదాన శిబిరం
గిరిజనులలో రక్త కొరత సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొంటున్నామని అందులో భాగంగా మొదకొండమ్మ పండుగ సమయంలో మే నెల 19. 20. 21. తేదీలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని సబ్ కలెక్టర్ ధాత్రి రెడ్డి ప్రకటించారు. ఈ రక్తదాన శిబిరం ఆ తేదీలలో పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు.
మొదకొండమ్మ పండగ సమయంలో మన సముదాయమంత ఒక్కటిగా చేరి గొప్పగా వేడుకలను జరుపుకుంటున్న సమయంలో జీవనదానం అందించడానికి ఆసక్తి గల రక్తదాతలు ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలని సబ్ కలెక్టర్ కోరారు. వివరాల కొరకు 9440933450 నంబర్లకు సప్రదించండి అని సబ్ కలెక్టర్ మీడియాకు తెలియ జేశారు.