అల్లూరి జిల్లా : మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు.
పాడేరు: వచ్చేనెల 4వ తేదీన పాడేరులోని డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ భవన వశిష్ట స్పష్టం చేశారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు మినీ సమావేశం మందిరంలో సర్వదిక ఎన్నికల పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు పక్కగా అమలు చేస్తామని తెలిపారు.