ఖరీఫ్ విత్తనాలకై ప్రతిపాదనలు - కొయ్యురు మండలం వ్యవసాయధికారిణి ఉమాదేవి.
2024-25సంవత్సర ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతలకు కావాల్సిన విత్తనాలకై ప్రతిపాదనలు, ప్రణాళికలు తయారుచేయడం జరిగిందని మండల వ్యవసాయాధికారిణి విమాదేవి శుక్రవారం ఒకప్రకటనలో తెలిపారు. ఇందులోభాగంగా 1060 క్విoటాళ్లు వరివిత్తనాలు రైతులకు సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆమె వివరించారు. ఇందులో ఆర్జిఎల్ 2537రకం సాగుచేసి చాలాఏళ్లు గడుస్తుంది కాబట్టి ఈ విత్తనం స్థానే ఏంటియు 1318 ఏంటియు 1262 రకాలను కూడా ఈ ఏడాది రైతులకు అందించేందుకు ప్రతిపాదించడం జరుగుతుందన్నారు. ఒకవేల ప్రతి ఏడాది విత్తడం వలన పురుగులు, తెగుళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తన రకాన్ని మార్చాల్సిందిగా రైతులకు ఎఓ ఉమాదేవి సూచించారు. అంతేగాక పచ్చిరొట్టె, పిళ్లిపెసర విత్తనాలను కూడా 90శాతo రాయితీపై అందజేయుచునట్లు తెలిపారు. ప్రతీరైతు గ్రామస్థాయిలో విత్తన శాతాన్ని పరిశీలించిన రైతులకు సరఫరా చేయడం జరుగుతుంది ఆమె తెలిపారు. హేక్టార్లు విస్థిర్ణoగల కలిగిన రైతులకు. సన్నకారురైతులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రైతులువద్ద విత్తనాలు కూడా వినియోగించుకోవచ్చునని ఆమె వివరించారు. రైతులు సాగుకు దిగిన తరువాత స్థానిక గ్రామవ్యవసాయ విస్తరణాధికారిను సంప్రదించి సాగుచేసిన రకo. సర్వే నెంబర్లు తదితర వివరాలలో ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని ఎఓ ఉమాదేవి గారు కోరారు.