విజయనగరం వన్ టౌన్ పోలీసుల అదుపులో ఫేక్ రిపోర్టర్ లు

జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించిన వాళ్లు ఢిల్లీ నుంచీ గల్లీ వరకు కోకొల్లలు. సరిగ్గా అలాంటి గ్యాంగ్ ని పట్టుకున్నారు విజయనగరం వన్ టౌన్ పోలీసులు. నగరంలో హోటల్ మయూరి యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు, క్రైమ్ ఎస్ఐ తారకేశ్వరరావులు తమ బృందంతో రంగంలో దిగి ఫిర్యాదు ఆధారంగా నలుగురు ఫేక్ రిపోర్టర్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



ఈ మేరకు సీఐ డా.వెంకటరావు మాట్లాడుతూ సత్యం న్యూస్.నెట్” ప్రతినిధిలం అంటూ ఫేక్ ఐడీ కార్డ్ లు సృష్టించి… ఫుడ్ ఇన్స్పెక్టర్లంటూ డబ్బులు వసూళ్లకు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందన్నారు. ఈ విషయమై మరింతగా విచారణ చేస్తున్నామనీ ఫేక్ రిపోర్టర్ లను స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తున్నామని సీఐ డా. వెంకటరావు తెలిపారు.