స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన అల్లూరి ఎస్పీ



అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ పాడేరు డిగ్రీ కళాశాలలో పాడేరు అరుకు నియోజకవర్గంలో సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను సోమవారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను క్షుణ్ణంగా జిల్లా ఎస్పీ పరిశీలించారు. అలాగే స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా దళాల బందోబస్తును పరిశీలించి అక్కడ బలగాలను ఎస్పీ పలు సూచనలను ఆదేశాలను జారీ చేసారు. అలాగే సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.