ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య! దర్యాప్తు చేస్తున్న కొయ్యూరు పోలీసులు.
మండలంలోని రాజేంద్రపాలెం పంచాయతీ. లెం గ్రామానికి చెందిన సురబోయిన కృష్ణ(35) అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజాము గ్రామానికి దగ్గరలో జీడి మామిడి తోటలో ఊరేవేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ముందు రోజు వరకు అందరితో హుషారుగా తిరిగిన ఇలా బలవన్మారణానికి పాల్పడ్డాడని తెలియడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు.
వివాహితుడైన కృష్ణారావు మైదాన ప్రాంతంలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇటీవల ఉద్యోగం మానేసినట్టు తెలుస్తుంది. ఎవరితోనో. ఎటువంటి విభేదాలు లేని కృష్ణారావు ఇలా బలవన్మారణానికి ఎందుకు పాల్పడ్డాడు? తెలియక స్థానికులు విచారం వ్యక్తంచేస్తున్నారు. ఆదివారం బయటకు వెళ్లిన కృష్ణారావు దగ్గర్లోనే జీడితోటలో చీరతో ఊరు వేసుకున్నాడు. తండ్రి సురబోయిన సత్య రావు. తమ్ముడు సురబోయిన రవి తదితరులు లబోదిబోమంటూ విచారిస్తున్నారు. కుటుంబీకులు ఫిర్యాదుతో కొయ్యూరు సీఐ వెంకటరమణ నేతృత్యంలో కోయ్యూరు ఎస్ఐ రామకృష్ణ తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి. కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టంనిమిత్తం నర్సీపట్నం తరలించారు. కాగా ఆర్థిక ఇబ్బందులు కారణంగా కృష్ణారావు బలవన్మారణానికి పాల్పడి ఉండవచ్చు అని కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు