సంక్షేమ పథకాలు పాలన సాగాలంటే మరోసారి జగన్ సీఎం కావాలి మన గుర్తు ఫ్యాన్...
ఎమ్మిగనూరు పట్టణంలో 15వ వార్డు లో ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్ట రేణుక ఆదేశాల మేరకు కొండాపూర్ ఇసాక్ గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి గడిచిన ఈ ఐదేళ్ల వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి జగన్ పాలనలో లబ్ధి చేకూరిందని అన్నారు. ఒకవైపు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బుట్ట రేణుకమ్మకి, ఎంపీ అభ్యర్థి అయిన బి వై రామయ్య కు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో 15వ వార్డ్ కౌన్సిలర్ కొండపురి ఇసాక్ 15 వ వార్డ్ యూత్ నాయకులు వార్డ్ ఇన్చార్జులు మరియు బూత్ కన్వీర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.