కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు విధులు మరియు నిఘా కెమెరాలతో పర్యవేక్షణ

వై.ఎస్.ఆర్ జిల్లా: ఇ.వి.ఎం లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఏర్పాటుచేసిన భద్రతా చర్యలను తనిఖీ చేసి పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పీ.ఎస్. పటిష్టమైన భద్రత నడుమ బ్యాలట్ బాక్స్ ల స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు. 24X7 గంటల నిరంతరంగా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు విధులు మరియు నిఘా కెమెరాలతో పర్యవేక్షణ.



సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఇ.వి.ఎం. బాక్స్ లను జిల్లా కేంద్రం లోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మౌలానా అజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ ల భద్రతా ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ పరిశీలించారు. సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... స్ట్రాంగ్ రూమ్ ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు మరియు సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతను కల్పించాలని ప్రతి ఒక్క సిబ్బంది మరియు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) శ్రీ ఎస్.ఎస్.ఎస్.వి కృష్ణారావు, కడప డి.ఎస్పీ ఎం.డి షరీఫ్, ఎ.ఆర్ డి.ఎస్పీ మురళీధర్, డి.టి.సి డి.ఎస్పీ రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్పీ సుధాకర్, రిమ్స్ పి.ఎస్ సి.ఐ కె. రామచంద్ర, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.