ఓటర్లకు అవగాహన కల్పిస్తున్న పోస్టరు విడుదల



వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో వున్న ఆఫీసు లో ఈ రోజు ఉదయం ఓటర్లకు అవగాహన కల్పిస్తున్న పోస్టరు విడుదల చేశారు. ఎన్నికలపై  బాలల్లో అవగాహన పెంచుతూ, వారి ద్వారా ఎన్నికలలో విలువలకు కట్టుబడి నిజాయితీగా ఓటు వినియోగించుకోవాలని పెద్దలను అభ్యర్థించేకు వి.సి.సి జిల్లాలో అన్ని జోన్స్ లో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. బాలల కోసం కృషి చేసే వారికి ఓటు వేయాలని, అవినీతి అక్రమాలకు పాల్పడే వారిని తిరస్కరించాలని, రాష్ట్ర, దేశ శ్రేయస్సు తో పాటు, మత సామరస్యంతో వున్నవారికి ఓటు వేయాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నీ కాపాడే వారికి ఓటు వేయాలని మో,, నినాదాలతో కూడిన పోస్టర్లు విడుదల చేశారు. రేపటి నుంచి అన్ని ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సతీష్,  కృష్ణారావు, నీలవేణి, కృష్ణవేణి, సత్యవతి, అలేఖ్య సరోజినీ, గణేష్, మణి, అప్పాలకొండ్ , కరుణ, యామిని, కాత్యాయిని, కుసుమ, పావని, దివ్య , అవుణ్యశ్రీ,, వారు పాల్గొన్నారు.