ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి: సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్.



ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ నుండి విశాఖపట్నం లోక్సభకు పోటీ చేస్తున్న పి సత్యారెడ్డి, సిపిఐ తరఫున విశాఖ దక్షిణం నుండి పోటీ చేస్తున్న విమల, అదేవిధంగా సిపిఎం తరపున విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై పోరాటం చేస్తూ గాజువాక నుండి పోటీ చేస్తున్న ఎం జగ్గు నాయుడు లను విశాఖపట్నం ప్రజలు గెలిపించాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్ పిలువు నిచ్చారు.. తాను విశాఖకు వారికి మద్దతు తెలిపేందుకు నేను విశాఖపట్నం వచ్చాను అని ఆమె తెలిపారు..పైన తెలిపిన ఇండియా కూటమి అభ్యర్థులు, సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింగరావు తో కలిపి ఆదివారం ఉదయం జగదాంబ జంక్షన్ లోని సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం లో బృందా మాట్లాడారు. ఏపీ హామీల అమల్లో బీజేపీ విఫలం. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా రాష్ట్రంలోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సైతం రాష్ట్ర హక్కులను పోరాడి సాధించుకునే విషయంలో పూర్తిగా వైఫల్యం చెంతటమే కాకుండా రాష్ట్రమంతా అవినీతిమయం చేసింది ఈ రెండు కారణాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకటే ప్రత్యానమయంగా ఐ ఎన్ డి ఐ ఏ పేరిట వారిపై పోటీకి నిలబడటం జరిగింది. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక కూటమి ఇండియా అయి దీని ద్వారా విజయం సాధిస్తామని ధీమా అధికారంలోకివ్యక్తం చేస్తున్నాను. 



ఇండియా కూటమి ప్రత్యామ్నాయం, ప్రస్తుత సమస్యలకు ప్రత్యామ్యాలు చూపేందుకు తమకూటమి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలతో పాటు స్థానిక సంఘాలు గిరిజన సంఘాలు అన్ని ముందుకు వచ్చి మాతో కలిసి పని చేస్తున్నాయి. ఇందులో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలను మీకు వివరిస్తాను అందులో మొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది, 2018లో మోడీ ప్రభుత్వం విశాఖపట్నం వచ్చి ఎన్నో హామీలు ఇచ్చింది నేడు వాస్తవ పరిస్థితికి వస్తే 2018లో మోడీ విశాఖపట్నం వచ్చి రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించారు కానీ నేటికీ రైల్వే జోన్ పూర్తి కాలేదు , అదేవిధంగా విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు, అది కాగితాల మీద మిగిలింది. బిజెపి వాషింగ్ మిషన్ విధానాన్ని అవలంబిస్తుంది ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై కేసులు పెట్టి వారి పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాటిని ఎత్తేస్తున్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ సైతం ఇదే కోవలో బిజెపితో జత కట్టి రాష్ట్ర ప్రయోజనాలను మోడీకి తాకట్టు పెట్టింది. తెలుగుదేశం యొక్క ప్రధాన నినాదం ప్రత్యేక హోదా కానీ ఈరోజు బిజెపితో జత కలిసి తమ పార్టీ విధానాన్ని పక్కన పెట్టింది ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ పక్కనపెడితే కనీసం పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయించలేకపోయింది అంతే కాకుండా అక్కడ గిరిజనుల కు ఇప్పటికీ ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించలేదు తద్వారా వేలకొద్దీ గిరిజనులు సమస్యల తో పోరాడుతున్నారు. ఇది జాతీయ ప్రాజెక్టు దీనికి కేంద్రం ఏం చేసిందని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రచారంలో భాగంగా నేను ఈ ప్రాంతాలలో పర్యటిస్తాను. 

గిరిజన హక్కులకు రక్షణ లేదు. విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లోని గిరిజన ప్రాంతాలను ప్రజలంతా ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారు వారికి రాజ్యాంగం ద్వారా లభించాల్సిన హక్కులు వారికి లభించడం లేదు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో బాక్సైడ్ భూముల కోసం గిరిజనులు భూములను అక్రమంగా లాక్కుంటున్నారు. ఇల్లీగల్ మైనింగ్ కేసులు కలిగిన చరిత్ర ఉన్న అభ్యర్థికి ప్రచారం చేసేందుకు రేపు మోడీ ఈ ప్రాంతానికి రానున్నారు. సదరు అభ్యర్థి బాక్సైట్ భూముల్లో మైనింగ్ చేసేందుకే ఈ ప్రాంతం నుండి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. నరేంద్ర మోడీకి రైల్వే జోన్ పట్ల ఎటువంటి నిబద్ధత లేదు కేవలం బాక్సైట్ భూములను దోచుకునేందుకే ఆయన విశాఖ వస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేసే మరొక విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ సంపద అయిన గంగవరం పోర్టును ఆధానికి కట్టబెట్టారు. అదానికి మోడీకి ఉన్న స్నేహ సంబంధం ద్వారా గంగవరం పోర్టులో ఆదని సొంతం చేసుకోగలిగాడు. నేడు ఆ పోర్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కు రావలసిన కొకింగ్ కోల్ ను బ్లాక్ చేసి స్టీల్ ప్లాంట్ ను మూసేందుకు కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారమై కార్మికులంతా పనిచేయడానికి సిద్ధమైనప్పటికీ అదానీ యాజమాన్యం మాత్రం కార్మికులను పనిలోకి రాకుండా కుట్ర పూర్తి చర్యలు చేపట్టింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకే కేంద్రం కోర్టు ఆదేశాలను సాయంత్రం ధిక్కరిస్తూ అతని యాజమాన్యంతో కలిసి స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి నెట్టేస్తుంది. ఈ చర్యలను నేను ఖండిస్తున్నాను వెంటనే అదాని యాజమాన్యం సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ పోర్టు కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించి స్టీల్ ప్లాంట్ కు సరఫరా చేయవలసిన కోకింగ్గ్ కోల్ వెంటనే పంపించి స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అసలు విశాఖ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏమైపోయారు సమస్యలపై పోరాటం చేయకుండా ఇక్కడ ఎంత నష్టం జరుగుతుంటే వారంతా ఎక్కడికి వెళ్లారు ఇదంతా వారి యొక్క వైఫల్యంగా నేను భావిస్తున్నాను... ఈ సమావేశం లో ఇండియా వేదిక అభ్యర్థులు తమను గెలిపించాలని కోరారు..