సార్వత్రిక అన్నికల్లో కొంతమంది నేతలకు వింత అనుభవం ఇంట్లో ఓట్లకు పర'కొత'..!
సార్వత్రిక ఎన్నికలో తమ పార్టీ ల గెలుపుకై ప్రచారం నిర్వహించిన వివిధ పార్టీ లకు చెందిన కొంతమంది నేతలు వింత అనుభవం ఎదురైనట్లు పోలింగ్ సరళిబట్టి వ్యక్తమవుతుంది. ఊరంతా ప్రచారం చేసి వచ్చిన ఆ పార్టీ నేతలు ఇంట్లోనే తమ కుటుంబ సభ్యులుయే ప్రత్యర్థి పార్టీ లకు ఓటు వేసినట్లు అర్ధం అవుతుంది దీనితో ఖంగుతిన్న నేతలు చేసిది ఏమి లేక తలలు పట్టుకున్నారు.
ఈ నెల13న కొయ్యురు మండలం లో ఎన్నికలు 56పోలింగ్ బూత్ లలో 43.178మంది ఓటర్లు గాను 29.001మంది తమ ఓటుహక్కు ను వినయోగించు కున్నారు. అయితే పోలింగ్ సరళిని బట్టి తమ పార్టీ లు గెలుపు ఓటమిలపై పోలింగ్ లెక్కలు కడుతుండగా కొంత మంది నేతలు కుటుంబ సభ్యులు ప్రత్యర్థిపార్టీలకు ఓటు వేసినట్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయు. దీనికి ఆ పార్టీ నేతలు అంత అయిపోయాక చేసేది ఏమి లేక రకరకాలుగా కారణాలు చెప్పుకుంటున్నారు.