అంగన్వాడీ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు కామ్రేడ్ తులసి గారు రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. తులసి మరణం యూనియన్ కి, ఉద్యోగులకు తీరని లోటు. ఆమె మరణానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్ వి కుమార్ , సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు, సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు సంతాపాన్ని తెలియజేసారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని ప్రకటించారు. కామ్రేడ్ తులసి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేసారు. జనవరి మాసం లో అంగన్వాడీ ఉద్యోగులు యూనియన్ చేపట్టిన సుధీర్గ సమ్మె పట్టు విడవ కుండా ఉద్యోగులను ఐక్యం చేస్తూ సమ్మె విజయవంతానికి మంచి కృషి చేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్భందాన్ని సైతం లెక్క చేయకుండా ధైర్యంగా నిలబడ్డారు. గతంలో టిడిపి ప్రభుత్వ నిర్భందాన్ని కూడా ఆ రాకంగానే ఎదుర్కొన్నారని గుర్తుచేసారు. తులసి గారి అంతిమ యాత్ర ఈరోజు సాయంత్రం 3 గం.లకు అల్లిపురం యల్లుపు వీధిలో వున్న వారి ఇంటి నుండి ప్రారంభం అవుతుంది. వాళ్ళ అబ్బాయి దుబాయ్ నుండి 12.30 కి వస్తాడు. కాన్వెంట్ జంక్షన్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని ఆర్ కె ఎస్ వి కుమార్, ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ తెలిపారు