ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు ఈరోజు అనగా 30.05.2024 వ తేది నాడు పెదవేగి సర్కిల్ అఫీస్ లో నూజివీడు డిఎస్పి లక్ష్మయ్య, పెదవేగి సిఐ కె శ్రీనివాసు కుమార్, పెదవేగి సర్కిల్ ఎస్సైలు దెందులూరు స్వామి మరియు పెదవేగి ఎస్ఐ రాజంద్ర ప్రసాద్ లతో లా అండ్ ఆర్డర్ శాంతిభద్రతల విషయాలపై సమావేశమును నిర్వహించినారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జూన్ 4వ తారీఖున నిర్వహించే కౌంటింగ్ సందర్భంగా పెదవేగి సర్కిల్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి గ్రామములో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లు ట్రబుల్ మాంగర్ ల పై ప్రత్యేకమైనటువంటి నిఘ ఉంచి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బైండోవర్లను చేయాలని, పోలీస్ అధికారులు ప్రతి గ్రామంలో ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ గురించి ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, కౌంటింగ్ సందర్భంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్న విషయాన్ని ప్రజలకు మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాల నిర్వహించాలని, కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా పోలీస్ కేసులలో ఇరుక్కుంటే కలిగే అనర్థాలను గురించి ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన కల్పించాలని, కౌంటింగ్ అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు సమాచారాన్ని సేకరించి సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఆధికారులు విధి నిర్వహణలో అలసత్వం పనికిరాదని ఏ చిన్న తప్పు జరిగినా ప్రజాశాంతికి భంగం కలుగుతుందని ప్రతి ఒక్కరు గమనించి ఉద్యోగ నిర్వహణ చేయాలని, ఉద్యోగ నిర్వహణలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే వారిపై శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన జిల్లా ఎస్పీ. జిల్లా ఎస్పీ తో పాటుగా ఎస్ బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.