కౌతాళం లోని సచివాలయం-2 లో దాదాపు 40కు పైగా పెన్షన్ దారుల డబ్బులు మాయం
వివరాల్లోకి వెళితే మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం లోని సచివాలయం-2 వెల్ఫేర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి 40 మందికి పైగా పెన్షన్ దారులు డబ్బులు విత్డ్రా చేసుకొని ఇప్పటివరకు డబ్బు ఇవ్వకుండా కాలం గడుపుతున్నాడు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రతినెల ఒకటి నుండి 5వ తారీఖు లోపు పెన్షన్ ఇవ్వాలని ఆ రోజులలోనే సైట్ పనిచేస్తుందని ఐదో తారీకు దాటిన తర్వాత పెన్షన్ దారులకు ఇవ్వని డబ్బులు తిరిగి ప్రభుత్వానికి జమ కావడం జరుగుతుందని ఇప్పటివరకు డబ్బు ఇవ్వలేదు ఆ పెన్షన్ దారుల పరిస్థితి ఏంటి? అసలే వికలాంగులు అంగవైకల్యం ముసలితనం వెంటాడుతున్న పరిస్థితులలో వారికి వచ్చిన డబ్బులు ఇంకా ఇవ్వకుండా తన వ్యక్తిగత కారణాలు వాడుకున్నాడా మరి ఇంకేదైనా చేశాడన్న విషయాలు తెలియక ఏ ఆఫీస్ కు వెళ్లాలో తెలియక పెన్షన్ దారులు నానా వస్తువులు పడుతున్నారు.
ఈ విషయంపై ఎంపీడీవో కు చరవాని ద్వారా వివరణ కోరగా వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారానే తన సొంత డబ్బును పెన్షన్ దారులు ఎవరైతే నష్టపోయారో వారి అందరికీ డబ్బు కట్టిస్తామని తెలియజేశారు.