చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నా ఆశ సామాన్య ప్రజల్లో

పాడేరులో టీడిపి, రాష్ట్రo లో కూటమి గెలుపు తద్యం - మండల తెలుగుదేశం పార్టీ నేతలు ధీమా..



జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళినిబట్టి పాడేరులో టిడిపి, రాష్ట్రంలో కూటమి గెలుపు తధ్యమని స్పష్టమవుతొందని టిడిపి నేతలు గొలుసింగి సత్య నారాయణ. కొర్రు రాముమూర్తి, వరహాల బాబు. పోటు కూరి సన్యాసిరావు, దేవా వ్యక్తం చేశారు. శుక్రవారం ఇచ్చిన ఒక ప్రకటనలో ఇలా పేర్కొన్నారు. పాడేరు నియోజకవర్గం టిడిపికి ఓటు వేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. కొయ్యూరు మండలంలో పోలైన 20091ఓట్లలో సుమారు 16వేల ఓట్లు టిడిపికి వస్తాయన్నారు. వైసిపి పాలన పై ప్రజలు విరక్తి కనబరిచినట్లు వ్యక్తంఅవుతుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నా ఆశ సామాన్య ప్రజల్లో కనిపించిందన్నారు. ఉద్యోగాలు సైతం వైసీపీ పాలనతో విసిగిపోయి ఉన్నారని తెలిపారు. మళ్లీ టీడీపీ బిజెపి జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది