పాడేరు జై మహా భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొంకు అర్జున్ రావు జోరుగా ఎన్నికల ప్రచారం....
నేడు చింతపల్లి మండలం లో ఉన్న మారుమూల గిరిజన ప్రాంతాలు అయిన ఎర్ర బంధ, కొమ్మంగి, ఎలాగలపాలెం, మరియు కొయ్యురు మండలంలో గల శరబన్నపాలెం, మాకవరపాలెం, పడి, రత్నం పేట గ్రామాలలో తిరిగి ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్జున్ రావు వెళ్లిన ప్రతి చోట, ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ఈ సందర్బంగా పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి బొంకు అర్జున్ రావు మాట్లాడుతూ నేను పార్టీ ల కోసం పని చేసే వ్యక్తిని కాను ప్రజల కోసం పని చేసే వ్యక్తిని మీలో ఒక్కడిని మీ అందరికి తెలిసిన వ్యక్తిని. ఈ రోజు 5వేల రూపాయలు డబ్బులు తీసుకొని ఓటు వేస్తే మీ భవిష్యత్తు మిరే అమూకున్నట్లు నిజాయితీగా ఓటు వేయండి. నన్ను నమ్మి ఫ్రూట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి. మీకు ఎపుడు అండగా నేనుంటా నేను గెలిసిన ఓడినా నేను ఎపుడు ప్రజల కోసం పోరడు తాను మీకు ఎపుడు ఏ కష్టం వచ్చిన అండగా వుంటాను అని ప్రజలకు భరోసా ఇచ్చారు. వెళ్లిన ప్రతి గ్రామంలో ప్రజలు నీలాంటి మంచి నాయకుడు మాకు కావాలి మేమందరం మీకు అండగా వుంటం ప్రూట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటాం స్థానిక గిరిజనులు తమ హర్శన్ని వ్యక్తం చేశారు.