క్రిందకు వేలడుతూన్న కరెంట్ తీగలు...



అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీది మండలం దారకొండ పంచాయతీ దారకొండ కాలని లో కరెంట్ తీగలు వంగిపోయి క్రిందకు వేలడుతూ ఉన్నాయి. 



ఈ వ్రేలాడే కరెంట్ తీగలు అక్కడ నివసిస్తున్న స్థానిక గిరిజనులకు త్రగిలేటట్లుగా వేలడుతు ఉన్నాయి, పిల్లలు చేతులతో త్రాకే అంతటి దిగువకు వేలాడుతున్నాయి. కాలని చుట్టుపక్కల మా సాగు భూమిలో ఈ విధంగా ఉండటం వలన వ్యవసాయం ఆధారంగా చేసుకుని జీవనాధారం చేస్తున్న మేము, మా పశువులు ఈ తీగలకు తగిలి చనిపోయే పరిస్థితి ఉందని స్థానిక విద్యుత్ అధికారులకు లైన్ మెన్ తెలియజేసిన ఎవ్వరూ కూడా కనీసం స్పందించటం లేదు. ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే స్పందించి ఈ వ్రేలాడే తిగలని మరమ్మతులు చేయాలని, స్థానికంగా నివసిస్తున్న గిరిజనులు తమ గోడు మీడియాకు వ్యక్తం చేశారు.