బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయo?

బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయo?

పోలీసులను ఆశ్రయించిన భాధితురాలు గాం. మల్లయమ్మ



జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనికి సంబంధించిన జమ చేసిన సామజిక పెన్షన్ సొమ్ము తన వ్యక్తిగత భ్యాoకు ఖాతాల నుండి మాయమైందoటూ ఓ భాధితురాలు గురువారం కొయ్యురు పోలీసులను ఆశ్రయించింది. కొయ్యూరు మండలంలోని మర్రివాడ పంచాయితీ దొడ్డవరం గ్రామానికి చెందిన గాం.మల్లయమ్మ అనే మహిళకు చెందిన ఉపాధి హామీ పనికి సంబంధించిన వేల సొమ్ముతో పాటు మే నెలకు సంబంధించిన పెన్షన్ సొమ్ము రూ.3000లు కలిపి మొత్తం సొమ్ము తన ఖాతా నుండి అదృశ్య మయ్యాయని వాపోయారు. గ్రామానికి చెందిన ఇద్దరువ్యక్తులు పై అనుమానం వ్యక్తం చేస్తూ కొయ్యురు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు భాధితురాలు గాం. మల్లయమ్మ తెలిపారు.