బహుళ వైకల్యoగల పిల్లల వివరాలను తెలియజేయండి

బహుళవైకల్య పిల్లల వివరాలను అందించాలి కొయ్యూరు ఐసిడిఎస్ సిడిపిఓ విజయ్ కుమారి.



బహుళ వైకల్యoగల పిల్లల వివరాలను స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు సంబంధిత ఐసిడిఎస్ సూపర్ వైజర్లకు తెలియజేయాలని కొయ్యూరు ఐసిడిఎస్ సిడిపిఓ విజయ్ కుమారి గురువారం ఒక ప్రకటనలో కోరారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అంగవైకల్యం, బుద్ధి మoద్యం, చెవిటి అందత్వం, ప్రసంగం, మరియు బాసవైకల్యం, కుష్టువ్యాధి, తక్కువ దృష్టి, దృష్టిలోపం, పిల్లలు ఏ అంగన్వాడి కేంద్రాల పరిధిలో ఎంతమంది ఉన్నారనే వివరాలను సూపర్వైజర్లకు అందజేస్తే వారు ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. దీనితో వారికి ప్రత్యేక బడ్జెట్ లేదా ప్రత్యేక సహాయం అందుతుందని సిడిపిఓ విజయ్ కుమారి వివరించారు.