కొయ్యురు మండలం సోలాబ్ శివారు నున్న జోగంపేట లో అక్రమంగా నిల్వ చేసిన "13 గన్నర దుంగలు " పట్టివేత.
కలప అక్రమంగా నిల్వ చేసే దాచిపెట్టిన 13 దుంగలను పట్టుకుని స్వాధీనం పరుచుకున్నట్లు జీకే వీధి వీధి మండలం పెదవలస గ్రామంలో అటవీ రేంజ్ అధికారి కే. జగదీష్ తెలిపారు. ఈ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యూరు మండలం. సోలాబ్ శివారు నున్న జోగింపేటలో కలప అక్రమ రవాణా చేసేందుకు సిద్ధం చేసిన సమాచారంతో బుధవారం ఆ ప్రాంతంలో తనిఖీలు చేసినట్లు రేంజర్ జగదీష్ తెలిపారు. ఈ తనిఖీల్లో నిల్వ చేసిన 13 జాతి కలప లభ్యమైనట్లు 30 వేల రూపాయలు విలువ ఉంటుందని తెలిపారు. పట్టుకున్న కలపను తరలించనున్నట్లు జగదీష్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఫారెస్ట్ స్ట్రైకింగ్ డి ఆర్ ఓ వెంకటరాజు ఫారెస్ట్ అధికారి నూకరాజు గార్డ్ రావణభూషణం మరియు స్ట్రైకింగ్ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.