ఎన్నికల కౌంటింగ్ దృష్టి 144 సెక్షన్ అమలు



సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరుగునున్న నేపథ్యంలో మండలంలో అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ అమలు విధించినట్లు కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, ఎస్సై లోకేష్ కుమార్, రామకృష్ణ లు తెలిపారు. కౌంటింగ్ నిర్వహించే ఈనెల 4వ తేదీన కౌంటింగ్ కేంద్రానికి రెండు కిలోమీటర్ల పరిధిలో బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులకు సహకరించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఏ నలుగురు ఒకచోట ఉండరాదు అన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించటం, వాహనాల్లో తరలిరావడం, ఎక్కువగా జనం గుమ్మ గుడి ఉంటే తగిన చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేశారు. అల్లర్లు ఎటువంటి గొడవలు సృష్టించిన తగిన కేసుల నమోదు చేయడం తప్పనిసరి అని సీఐ వెంకటరమణ, ఎస్సై రామకృష్ణ, లోకేష్ కుమార్  ఈ ప్రకటనలో బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఛానల్ కి తెలియపరచడం జరిగింది.