ఆపద వచ్చిందా ఆందోళన వద్దు...మేమున్నాం

రోడ్డు ప్రమాద బాధితులకు అలిశెట్టి చిరంజీవి చేయూత..



కొయ్యూరు మండలంలో చింతవానిపాలెంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ చేరుకున్న వెలమ కాసులమ్మ. కుమార్తె వెలమ మీనాక్షి లకు మెరుగైన వైద్యం సకాలంలో అందించడానికి మేమున్నం టీం ప్రతినిధి అలిశెట్టి చిరంజీవి, సభ్యులు విశేష కృషి చేశారు.



బాధితుల తరఫున వచ్చిన వారికి భోజనాలు ఏర్పాటు చేయడంతో బాటు, అవసరమైన పరీక్షలను వేణు వెంటనే జరిపించుటకు అలాగే వారికి గ్రామనికి చేర్చడానికి అవసరమైన వాహనాన్ని సమకూర్చడానికి ఆర్థికంగా సహాయపడ్డారు. ఎక్కడ ఆపద ఉన్న మేముంటాం అని అలిశెట్టి చిరంజీవి టీం సభ్యులు పలువురు అభినందిస్తూ వారి సేవలను మనస్పూర్తిగా కొనియాడుతున్నారు