అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జమాల్ భాషా సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మి తనిఖీ నిర్వహించారు. రిజిస్టరు లు అన్నీ తనికిచేసినారు. క్లినిక్, వార్డ్, లేబర్ రూమ్, లాబ్ మరియు ఫార్మ్ సీ లను మలేరియా డ్రగ్స్ తనిఖీ చేసినారు. మలేరియా కేసుల వివరాలను, స్ప్రేయింగ్ వివరాల వంటి అన్ని విభాగాలను గూర్చి వైద్యాధికారి డా. కె. సౌమ్య నీ అడిగి తెలుసుకున్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబల కుండా పటిష్ట మైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫీడర్ అంబులెన్స్ సేవలు గూర్చి తెలుసుకున్నారు. వాహనానికి కావలసిన ఆయిల్ చింతపల్లి లో ఉన్న ఇండియన్ అయిల్ బంక్ లో ఇస్తున్నారు. చింతపల్లి నుండి సీలేరు కి 70 కిలోమీటర్లు నుండి పెట్రోల్ తీసుకు రావడం కష్టం అని స్థానిక H.P ఆయిల్ బంక్ లో పొందేలా ఆదేశాలు ఇప్పించమని ఫిడార్ అబ్యులెన్స్ డ్రైవర్ కోరడం జరిగింది.
సోదాలు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలను ప్రశంసించారు. సదరు కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి కె. జోజిబాబు, అరోగ్య పర్యవేక్షకులు యన్.త్రినాధ్, స్టాప్ నర్స్ మాధురి, ఆరోగ్యకార్య కర్త సత్యన్నారాయణ, ఫిడర్ అబులెన్స్ డ్రైవర్ వెంకటేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.