చింతవానిపాలెంలో ఘోర ప్రమాదం

బైక్ అదుపుతప్పి లోయలోకి చింతవానిపాలెంలో ఘోర ప్రమాదం. లోయలోకి దూసుకెళ్లిన బైక్ తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి. తీవ్ర గాయాల పాలైన తల్లి కూతుర్లు.



బంధువులు ఇంటికి చుట్టపు చూపుకుని వెళ్లి వారితో రెండు రోజులపాటు ఆనందంగా గడిపి  స్వ గ్రామం వెళ్లేందుకు తిరిగి ప్రయాణంలో ఆ కుటుంబానికి తీవ్ర విషాదం ఎదురయింది. రోడ్డు ప్రమాదంలో ఆ ఇంట్లోనే ఇద్దరినీ కభలించగా మరో ఇద్దరూ మృత్యువు పోరాడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. 



జిల్లాలోని అడ్డతీగల మండలం వీరవరం పంచాయతీ సీతావరం గ్రామానికి చెందిన వెలమ రాంబాబు వెలమ కాసులమ్మ దంపతులు బంధువులు ఇంటికి వద్ద ఉన్న తమ కుమార్తె మీనాక్షి తీసుకొచ్చేందుకు కొయ్యూరు  మండలంలోని బాలరేవుల గ్రామానికి రెండు రోజులు క్రితం వచ్చారు. అటుపై శుక్రవారం తిరుగు ప్రయాణంలో బైకుపై రాంబాబు కాసులమ్మ దంపతులతో పాటు కుమారుడు ప్రశాంత్ కుమార్తె మీనాక్షి కలసి వస్తుండగా చింతవానిపాలెం దాటాక ఘాట్ రోడ్లో బైక్ అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది. 



దీంతో బైక్ నడుపుతున్న వెలమ రాంబాబు ఎదుట కూర్చున్న వెలమ ప్రశాoత్ సంఘటన స్థలం వద్దే తీవ్ర గాయాలు తో మృతి చెందగా కాసులమ్మ కుమార్తె మీనాక్షి తీవ్ర గాయాలు పడడంతో రాజేంద్రపాలెం ఆసుపత్రికి తరలించారు. 



రాజేంద్ర పున్నమిలో చికిత్స చేసిన అనంతరం ఏరియా హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. కాసులమ్మ గుడిచేయి విరిగిపోగా మీనాక్షికి తలపై గాయం అయింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.