బంగారం అక్రమ వడ్డీ వ్యాపారం - ఆందోళనలో ప్రజలు

అన్ని ఆధారాలతో మీడియా ముందుకు బాధితులు వచ్చే అవకాశం...
అశ్వారావుపేటలో బంగారం అక్రమ వడ్డీ వ్యాపారం - ఆందోళనలో ప్రజలు..



స్థానికంగా బస్టాండ్ సెంటర్లో ఓ వ్యాపారి లక్షల్లో బంగారం పై అధిక వడ్డీలకు తాకట్టు పెట్టుకుని ఆస్తులు సంపాదిస్తున్నారని సమాచారం. ఈ వ్యాపారి తెల్ల రేషన్ కార్డు పై కొనసాగుతూ ఉండటం గమనార్హం. పూర్తి ఆధారాలతో బాధితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తాము ఈ వ్యాపారి దగ్గర బంగారం తాకట్టు పెట్టినప్పుడు బంగారం బరువు, నీకరం విలువ గురించి స్పష్టత ఇవ్వకుండా, ఏ రశీదులు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చాడని ఆరోపిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టిన యజమానికి మరణం వంటి అనివార్య పరిస్థితి కలిగితే, బంగారం మొత్తం షాపు యజమాని సొంతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు మోసపోవడం, బంగారం తాకట్టు పెట్టిన వాదులకే రశీదులు ఇవ్వకపోవడం వంటి విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

తాజా పరిణామాలు: బాధితులు తమ వివరాలతో ఆధారాలతో మీడియా ముందుకు వచ్చే అవకాశం. ఇటీవల అధికారులు సోదాలు చేసినప్పటికీ ఇలాంటి వ్యాపారం చేసే వ్యక్తులు భయపడకుండా అక్రమ వడ్డీ వ్యాపారాలు చేయటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వ్యవహారంలో న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని బాధితులు తెలిపారు.