శ్రీకాకుళం జిల్లా
జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక ఐపీఎస్ ఆదేశాల మేరకు నాటు సారా జిల్లాలో పూర్తి స్థాయిలో అరికట్టాలని ఆదివారం ఉదయం జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు మందస పోలీసు స్టేషన్ పోలీసులు సంయుక్తంగా మందస మండలం చాపరాయి ఏజన్సీ గ్రామంలో నాటు సారా తయారీ స్థావరాలపై చేసిన దాడులలో భాగంగా నాటుసారా తయారీకి ఉపయోగించే 1600 లీటర్ల బెల్లపు ఊటను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు..ఈ మేరకు జిల్లాలో నాటు సారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం జిల్లా పోలీసులు హెచ్చరించారు.