జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ సునీత కుమారి ని మర్యాదపూర్వకంగా కలసిన బ్యాక్ టూ బ్యాక్ న్యూస్ ఛానెల్ ప్రతినిధులు..

అల్లూరి జిల్లా కలెక్టర్ ను కలిసిన బ్యాక్ టూ బ్యాక్ న్యూస్ ఛానెల్ జిల్లా బ్యూరో చీఫ్ పాంగి సత్తిబాబు.

అల్లూరి సీతారామరాజు జిల్లా బ్యాక్ టూ బ్యాక్ న్యూస్ ఛానెల్ చీప్ బ్యూరో చీఫ్ పాంగి. సత్తిబాబు, చింతపల్లి మండల రిపోర్టర్ శంఖర్ లక్ష్మివారం నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ సునీత కుమారి ని మర్యాదపూర్వకంగా కలిశారు. 


ముందుగా పుష్ప గుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అల్లూరి జిల్లలో మారుమూల గ్రామాలలో నెలకొన్న ముఖ్యమైన సమస్యలు అయినటువంటి త్రాగునీరు, రోడ్డు, పాఠశాలలు, వైద్యం, విద్యుత్, నిరుద్యోగం, ఇలా చాలా ఉన్నాయి. అవి తీర్చే దిశగా అడుగులు వెయ్యాలని కోరారు. రానున్నది వర్షాకాలం ఏజెన్సీ ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా పడతాయి దానివల్ల వర్షపు నీరు కలుషితమై మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున, విష జ్వరాలు ప్రబలినచోట మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ..ఈ మేరకు కలెక్టర్ శ్రీమతి విజయ సునిత కుమారి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరిగిన ఉన్నది ఉన్నట్టుగా వార్త రూపంలో ప్రచురించి తమ దృష్టికి తీసుకురావాలని, తమ దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. అల్లూరి జిల్లా యందు నూతనంగా బాధ్యతలు చేపట్టి జిల్లాను ఉన్నత స్థానంలో ఉండే దిశగా ప్రణాళికలు వేస్తూ ముందుకు సాగుతున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ సునీత కుమారి కు బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఛానెల్ తరపున అల్లూరి జిల్లా ప్రభుత్వ అధికారుల తరపున, రాజకీయ నాయకుల తరపున మరియు ప్రజలందరి తరపున స్వాగతం మరియు ధన్యవాదములు తెలియజేస్తూ.. ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ప్రజా న్యూస్ ఛానెల్ గా గుర్తింపు తెచ్చుకున్న అందరి బ్యాక్ టూ బ్యాక్ న్యూస్ ఛానెల్.