తల సేమియా చిన్నారులకు అనునిత్యం రక్తదాతలు..

ప్రపంచ రక్త దాతలు దినోత్సవం సందర్భంగా రక్తదానం : రక్త బంధ ఆర్గనైజేషన్ కన్నా వెంకటేష్



అనంతపురం జూన్ 14: ధర్మవరం చెందిన కన్న వెంకటేష్ రక్త బంధం మార్గదర్శన్ ఆధ్వర్యం ద్వారా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి అనంతపూర్ కడప కర్నూలు మూడు జిల్లాల్లో వారి మిత్రులు ద్వారా దాదాపు ఇప్పటివరకు 4500 పైగా బ్లడ్ క్యాంపు ద్వారా మరియు బత్తలపల్లి ఆర్ డి టి హాస్పిటల్ లో తల సేమియా చిన్నారులకు అనునిత్యం రక్తదాతలను పంపిస్తూ ఉండడం జరుగుతుంది. ఈ రోజున ప్రపంచ రక్త దాతలు దినోత్సవం సందర్భంగా రక్త బంధం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్ ప్రపంచ రక్త దాతలు దినోత్సవం సందర్భంగా స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడానికి ధర్మవరం నుంచి అనంతపూర్ దీపు బ్లడ్ బ్యాంక్ వచ్చి తన o+ve 24 వ సారి రక్తదానం చేయడం జరిగింది.  ఈ ఒక్క కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మరియు రక్త బంధం ఆర్గనైజేషన్ సభ్యులు మరియు బ్లడ్ బ్యాంకు సిబ్బంది కన్న వెంకటేష్ నీ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్న వెంకటేష్ మాట్లాడుతూ ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం జరిగింది ఇప్పటివరకు 24 రక్తము 22 తెల్ల రక్త కణాలు మొత్తం 46 సార్లు రక్తదానం చేయడం జరిగింది భవిష్యత్తులో ప్రతి మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా రక్తదానం చేస్తామని ఈ కార్యక్రమంలో తెలపడం జరిగింది.