కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం వారపు సంతలో ఆదివారం మావోయిస్టులకు వ్యతిరేకంగా చింతవానిపాలెం, గంగవరం, మంప, బూదరాళ్ల, ముకుడుపల్లి తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టులు పోవాలి, అభివృద్ధి కావాలి అంటూ నినాదాలు చేశారు. మావోయిస్టుల వల్లే గిరిజన ప్రాంతంలో అభివృద్ధి జరగడం లేదన్నారు. మావోయిస్టులారా మీ వల్లే మాకు అభివృద్ధి జరగడం లేదు, మా అల్లూరి జిల్లాకు రావద్దని నినాదాలు చేశారు.