ఇల్లు కి ఇల్లు ఇంటికి ఒక జాబ్

సీలేరు గ్రామ పంచాయితీ, పార్వతి నగర్, గ్రామస్థులు స్థానిక సర్పంచ్ మరియు ఎంపీటీసీ లకు పిర్యాదు.



పార్వతి నగర్ అనే గ్రామం లో సుమారు గా 15 సంవత్సరాల కాలం నుండి, గిరిజన జాతికి చెందిన 26 కుటుంభలు వారు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ మధ్య కాలం లో సీలేరు AP Genco అధికారులు వచ్చి ఈ యొక్క గ్రామానికి కాళీ చెయ్యండి అని పదే పదే ఆ గ్రామానికి వచ్చి వేదిస్తున్నారని ఆ గ్రామస్తులు తెలియజేశారు అది ఎ విధముగా అంటే, పార్వతి నగర్ గ్రామం మా యొక్క genco స్థలం లో ఉంది మేము ఈ స్థలములో పవర్ ప్రాజెక్ట్ కట్టాలి కనుక మీరందరు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోండి అని జెన్కో అధికారులు తెలిపారని గ్రామస్తులు అన్నారు. అయితే మేము వెళ్ళిపోతాము గాని మేము గ్రామము ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎందుకు ap genco వాళ్ళు స్థలం మాది అని అడ్డు పడలేదని, ఆరోజు పారెస్ట్ వాళ్ళతో ఎన్నో సమస్యలు ఎదుర్కొని సీలేరు పోలీస్ స్టేషన్ వరకు కూడ వెళ్లి పోరాడి గ్రామాన్ని మేము ఏర్పాటు చేసుకున్నామని ఇప్పుడు వచ్చి స్థలము ఖాళీ చెయ్యమంటే మేము ఖాళీ చేసే ప్రసక్తే లేదు అని గ్రామస్తులు వాపోయారు, ఖాళీ చేసే పరిస్థితి వస్తే ap genco వారు మాకు స్థలం కేటాయించి, ఇల్లు కి ఇల్లు ఇంటికి ఒక జాబ్ ఇస్తాము అని జిల్లా కలెక్టరేట్ వారి చేత లిఖిత పూర్వకముగా హామీ ఇస్తే నే మేము ఉన్న గ్రామాన్ని ఖాళీ చేస్తామని మా యొక్క pvtg గ్రామా ప్రజలను న్యాయం చేకూర్చుండని స్థానిక సీలేరు గ్రామ పంచాతి సర్పంచ్ మరియు ఎంపీటీసీ లకు వినతి పత్రం అందజేశారు.