అల్లూరి సీతారామరాజు జిల్లా బీజేపీ యువ నాయకులు బీజేపీ పార్టీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్, అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి దుక్కేరి ప్రభాకరరావు, విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుని, తన పార్టీ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలో నెలకొన్న సమస్యలపై వివరించి బీజేపీ జనసేన టీడీపీ కూటమి పార్టీ అధికారుల సహాయ సహకారాలు మా ప్రజలకు ఎప్పుడు ఉండాలనీ అన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూటమి పార్టీలు అధికారంలో ఉంటే పాడేరు, అరకు నియోజకవర్గాలు, అరకు పార్లమెంట్ వైసీపీ పార్టీ నాయకులకు అధికారం ఉన్న, రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉండటం వలన ప్రజలకు ఎమ్మెల్యేలు ఎంపీ లకు ఎం చెయ్యాలో ఏ సమస్య ఎవరికీ చెప్పాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారాని తెలపగ, అనంతరం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సానుకూలంగా స్పందిస్తూ అల్లూరి జిల్లాలో నెలకొన్న సమస్యలన్నీ కేంద్రం రాష్ట్ర దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలుపారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాక్ టు బ్యాక్ ఛానల్ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ దామోదర గోవింద్ మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు.