భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం పట్టణంలో నిన్న సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి గుణదీప్ ను హత్య చేసిన నిందితుడు తమ్మిశెట్టి కోటేశ్వరరావు అరెస్టు, మీడియా ఎదుట ప్రవేశపెట్టిన డిఎస్పి అబ్దుల్ రహమాన్. కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిఎస్పి అబ్దుల్ రెహమాన్ హత్య జరిగిన విధానం గురించి వివరించారు.
కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్ లో నిన్న గుణదీప్ అనే బీటెక్ విద్యార్థిని చంపిన తమ్మిశెట్టి కోటేశ్వరరావు, చుంచుపల్లి మండలం గాంధీ కాలనీకి చెందిన వాడని ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన గొడవలు, పాత కక్షలు ఉన్న నేపథ్యంలో గుణదీప్ ను కోటేశ్వరరావు మద్యం మత్తులో దారుణంగా కొట్టి చంపాడన్నారు. మృతుడు గుణదీప్ కు తమ్మిశెట్టి కోటేశ్వరరావుకు గతంలో గొడవ జరిగిన నేపథ్యంలో నిన్న నిషా బార్ లో మద్యం సేవిస్తున్న గుణదీప్ ను, అదే బార్ షాపులో మద్యం షాపులో సేవిస్తున్న కోటేశ్వరావు గమనించాడని, దీంతో పాత కక్ష ను గుర్తు చేసుకున్న కోటేశ్వరరావు గుణదీప్ ను బార్ షాప్ నుంచి బయటకు తీసుకొచ్చాడని, మద్యం మత్తులో ఉన్న కోటేశ్వరరావు రుణదీప్ ల విచక్షణ రహితంగా ఛాతీ పైన బలంగా కొట్టాడని, అపస్మాలకు స్థితిలో కింద పడిన గుణదీప్ ను కాళ్లతో సైతం విపరీతంగా తన్నాడని దీంతో గుణదీప్ అక్కడే అక్కడే మృతి చెందాడని, పోస్టుమార్టం నిమిత్తం గుణదెప్పుడుత దేహాన్ని సర్వజన ఆస్పత్రికి తరలించామని తెలిపారు. మృతుడు గుణదీప్ ను తీసుకురావడానికి నిందితుడు కోటేశ్వరావు ఉపయోగించిన స్కూటీ బైక్ ను స్వాధీనం చేసుకున్నామని, టెక్నికల్ ఆధారాలు, ప్రత్యక్ష సాక్షులు ఆధారంగా నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేసినట్లు తెలిపారు. నేర ప్రవృత్తి ఉన్న ఎంతటి స్థాయి వారినైనా ఉపేక్షించేది లేదని, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని, పీడియాక్ట్ కేసులు పెడతామని స్పష్టం చేశారు.