భారతదేశ ప్రధానిగా మూడోసారి భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికై ప్రధాని గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోడీ కి శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండి సురేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర ప్రభుత్వంతో విలీనమైన ఇతర రాజకీయ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ గ్రామీణ వైద్యుల సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో గ్రామ గ్రామాలలో పట్టణాలలో మురికివాడల్లో నివసించు పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రాథమిక వైద్యం చేస్తూ జీవనం సాగించు చున్న గ్రామీణ వైద్యులకు శాశ్వత పరిష్కారం చూపాలని భారతదేశం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందినప్పటికీ గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కారం కాలేదని బీజేపీ అభ్యర్థి గా భారతదేశ ప్రధాని గా మూడవ సారి ప్రమాణం చేయుచున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంలో గ్రామీణ వైద్యులకు శాశ్వత పరిష్కారం చూపాలని వారికి వృత్తి భద్రత, కల్పించాలని సంక్షేమ గ్రామీణ వైద్యులకు ఉపాధి హామీ సబ్సిడీతో రుణాలు /ఉచిత బస్సుపాసులు /ఉచిత ఇల్లు/ పెన్షన్లు గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత వారి కుటుంబాలకు సంక్షేమం /ఇన్సూరెన్స్ సౌకర్యం /రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని భారత దేశ లో ఉన్న గ్రామీణ వైద్యులు అందరితరుపున జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండి శెట్టి సురేష్ బాబు రాష్ట్ర /కేంద్ర ప్రభుత్వానికి విన్న వించు చున్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించడంలో గ్రామీణ వైద్యుల కీలక పాత్ర పోషించుచున్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించుచు ప్రాథమిక వైద్యం చేస్తూ ఉన్న గ్రామీణ వైద్యులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నారు వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భారత దేశంలో ఉన్న గ్రామీణ వైద్యులు అందరూ కోరుచున్నారని జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండిశెట్టి సురేష్ బాబు తెలిపారు