పిడుగు పడి గిరిజనుడు మృతి



కొయ్యూరు మండలం, బుధరాళ్ల పంచాయతీ, గొర్రెల మెట్ట గ్రామంలో శుక్రవారం పడిన భారీ వర్షానికి పిడుగు పడి గ్రామానికి చెందిన సిందేరి దేవరాజు (30) మృతి చెందాడు. భార్య ఇద్దరు కుమారులు గల సిందేరి దేవరాజు శుక్రవారం ఉదయం పశువులు కాపులకు వెళ్లి సాయంత్రం నాలుగు గంటల సమయంలో కురుస్తున్న భారీవర్షానికి పనస చెట్టు కిందకు వెళ్లగా ఆ సమయంలో పడిన పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సర్పంచ్ సాగిన ముత్యాలమ్మ వార్డ్ మెంబర్ సాగిన సంజీవ్ ప్రభుత్వానికి కోరుతున్నారు.