స్వచ్ఛంద రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

స్వచ్ఛంద రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్.



అనంతపురం జూన్ 14 ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారు గత కొద్ది కాలంగా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కు రక్తదాన శిబిరాములు నిర్వహణలో సహకరించిన వారికి కలెక్టర్ వినోద్ కుమార్ వారి చేతుల మీదుగా జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి అనంతపూర్ కి చెందిన జుట్టూరు మహేష్ బాబుకి ఇప్పటివరకు దాదాపు 77 సార్లు రక్తదానం చేసిన సందర్భంగా నేడు ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారు ఆహ్వానించి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీరు మీ సంస్థ రక్త బంధం ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకొనుటలో సహకరించినందుకు మీకు జ్ఞాపకం అందజేస్తూ సన్మానిస్తున్నాం అని రక్త బంధం ఆర్గనైజేషన్ సభ్యులు జుట్టురు మహేష్ బాబు ను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అని అన్నారు అనంతరం రక్త బంధం ఆర్గనైజేషన్ సభ్యులు జుట్టూరు మహేష్ బాబు మాట్లాడుతూ జూన్ 14న ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారి చేతుల మీదుగా నన్ను ఘనంగా సన్మానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు ఆపద సమయాల్లో అవసరమైన వారికి మానవతా దృకల్పంతో స్వచ్ఛంద రక్తదానం నకు సమాజంలో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు 18 సంవత్సరాలు నిండి కనీసం 45 కేజీలు బరువు కలిగిన వారు ఎవరైనా లింగ బేధం లేకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వచ్ఛంద రక్తదానం చేయవచ్చునని ప్రతి మనిషి మానవత దృకల్పంతో ముఖ్యంగా యువతీ యువకులు ముందుకు రావాలని రక్తదానం మానవతకు సంకేతమని మనిషి ప్రమాదాల్లో ఉన్నప్పుడు ఆపేసిన సమయాల్లో ఉన్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రక్త సహాయం అవసరమవుతుందని ఈ రక్త సహాయం మనిషికి మానవత్వంతో స్పందిస్తే తప్ప ఏ షాపుల్లోనూ ఏ మాల్ లోను లభించదు కావున ప్రతి మనిషి స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని రక్తదాతల దినోత్సవ ప్రాధాన్యతను గురించి రక్త బంధం ఆర్గనైజేషన్ సభ్యులు మహేష్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, కాపు రామచంద్రారెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు తదితరులు పాల్గొన్నారు.