గ్రామాల్లో కన్నింగ్ లేఔట్స్... మాముళ్ల కోసం అధికారుల నిర్లక్ష్యం... నిజమేనా..?
గ్రామ ప్రజలారా.. మోసపోకండి..!? హడావుడి మాటలు.. అధినాయకుని అండ ఉంది అని కళ్లిబొల్లి మాటలు చెప్తారు స్కీముల పెరూతో కూడా మోసం చేస్తారు తస్మాత్ జాగ్రత్త...?
ఇప్పటికే అధిక మొత్తంలో నగదును ఆశ చూపి కమీషన్ ఏజెంట్లను నియమించుకొన్నారు అని వినికిడి..? కమీషన్ దారులకు కావాల్సింది కమీషన్ మాత్రమే, చట్ట నియమాలు, పర్మిషన్ ల సంగతులు వారికి పట్టవు... ఒక్కసారి డబ్బు చెల్లించారంటే మీ డబ్బుకు మంగళం పాడినట్టే.. గుర్తుంచుకోండి లే అవుట్ కి ఉండాల్సిన నియమాలు, పర్మిషన్ ల పత్రాలను చూసి సంబంధిత అధికారుల నుండి వివరణ తీసుకొని మాత్రమే మీకు నచ్చిన స్థలాన్ని కొనుగోలు చేస్తే ఎప్పటికీ శ్రేయస్కరం. డబ్బు ఉందని ఆవేశo తో ఆలోచన చేయకుండా కొంటే తిప్పలు తప్పవు .ఇది ప్రజాహితవు మాత్రమే...!!!
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు 1 సచివాలయం పరిధిలో ఒక వ్యవసాయ భూమిని ల్యాండ్ కన్వర్షన్ లేకుండా, ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా కొందరు స్వార్ధ పూరిత ధనార్జనే ద్యేయంగా అక్రమ లేఅవుట్ కి ఉపక్రమిస్తున్నట్లు సమాచారం...? సంబంధిత లేఅవుట్ పశ్చిమవైపుకి వాస్తుదోషం లేకుండా రధం నుండి పెట్రోల్ బంకు వరకు ఉండే ఇసుక రస్తాను ఆక్రమించి చదును చేసినా మిన్నకుండి పోయిన గ్రామ VRO,రెవిన్యూ సిబ్బంది,గిద్దలూరు తహసీల్దార్...!!? గ్రామ సచివాలయం పరిధిలో ఉన్నవన్నీ అక్రమ లేఅవుట్లేనని గతంలో సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన వ్యక్తికి సమాచార అధికారి సమాచారం అందించినట్లు తెలియ వచ్చింది. మరి ఇప్పుడు వేస్తున్న లేఅవుట్లకు పంచాయతీ మరియు రెవిన్యూ అధికారుల అనుమతులు ఉన్నట్లా..? లేనట్లా..? లే అవుట్ అనుమతులు ఉంటే పంచాయతీ కార్యాలయం నోటీసుబోర్డులో ప్రదర్శించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనుమతులు ఉంటే అనుమతులు ఇచ్చిన పత్రాలను, ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రభుత్వ మరియు ప్రజా ప్రయోజనాల కొరకు కేటాయించాల్సిన 10% ల్యాండ్ ఎక్కడ ఏర్పాటు చేశారో సదరు లేయవుట్ నిర్వహకులు అధికారుల సమక్షంలో చూపించాలని గ్రామస్తులు అడుగుతున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారికి ప్రక్కనే వ్యవసాయ భూమిలో అక్రమంగా లేయవుట్ వేస్తున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న గ్రామ VRO...? పంచాయతీ కార్యదర్శి...? ఇంతకీ గ్రామాల్లో అక్రమ లేఅవుట్ లను నిరోధించాల్సిన భాద్యత ఎవరిది..? ఇప్పటికే సంబంధిత గ్రామస్థాయి నుండి మండల స్థాయి అధికారుల వరకు ఆమ్యామ్యాలు ముట్టాయని గుసగుసలు వినపడుతున్నాయి...!?? వీటిలో నిజమెంతో సంబంధిత అధికారులే తెలపాలి..!? ఈ అక్రమ లేఅవుట్ లో పట్టుమని పది ఓట్లు లేని ఆ గోడ మీది పిల్లి లా వ్యవహరించే ఆ కన్నింగ్ స్టార్ అధికారం ఏ పార్టీకి వస్తుందో యూట్యూబ్ సర్వే లు చూసి ఎన్నికలకు రెండు రోజుల ముందు పార్టీలో చేరినట్టు, గ్రామ పంచాయతీ స్థాయిలో ఇప్పటికే పార్టీ కోసం కష్టపడిన వారు వ్యతిరేకిస్తున్నారు, గత ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు లక్షల్లో అవినీతి చేశాడని మండలమంతా తెలుసు. ప్రస్తుతం ఈ కన్నింగ్ స్టార్ కొత్తగా అధికారం లోకి వచ్చిన పార్టీకి కలంకం అంటేలా గత ప్రభుత్వం లో చేసినట్లు ఇప్పుడు చేస్తున్నాడని గ్రామంలో ప్రజల నుండి విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ అక్రమ లేఅవుట్ లను తొలగించి ప్రజా ప్రయోజనం తద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా చూస్తారా..?* లేక తమ జోబులు నిండాయని మిన్నకుండి పోతారో వేచి చూడాలంటున్న గ్రామ ప్రజలు...!!?? ఇది అశోకుడి పాలన అవినీతిని ఉక్కుపాదంతో తొక్కుతాడు అని నియోజకవర్గం ప్రజల విశ్వాసం. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వార్ధ ప్రయోజనం కోసం పార్టీలోకి వచ్చిన వారిని ప్రోత్సాహించవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం ..?