కర్ణాటక విద్యార్ధిని రజిని పుట్టినరోజు సంబరాలు

రక్త బంధం ఆర్గనైజేషన్ నిర్వాహకుడు కన్నా వెంకటేష్ ఆధ్వర్యంలో కర్ణాటక విద్యార్ధిని రజిని పుట్టినరోజు సంబరాలు 



సత్య సాయి జిల్లా జిల్లా రక్త బంధం ఆర్గనైజేషన్ నిర్వాహకులు కన్నా వెంకటేష్ ఆధ్వర్యంలో రాప్తాడు రూరల్ రామనేపల్లి పరిధిలో సద్గురు బాబా వృద్ధాశ్రమం ఉంటున్న అభాగ్యులకు కర్ణాటక విద్యార్థి రజిని పుట్టినరోజు సందర్భంగా టిఫిన్ పంపిణీ చేస్తూ వారి మధ్యనే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. 



ప్రతి ఒక్కరు పుట్టినరోజు లేదా శుభకార్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ మానవ విలువలు పెంచవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నా వెంకటేష్, రజిని, రామంజి, హరి, సదా, తదితరులు పాల్గొన్నారు.