ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు చోటు చేసుకుంది. గతంలో జూన్ 9న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. అయితే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఏపీలో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 175 స్థానాలకుగానూ టీడీపీ – 136, జనసేన – 21, బీజేపీ – 8 మొత్తం 165 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. అయితే జూన్ 9న అమరావతి వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే అదే రోజున ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఉండటంతో గతంలో ప్రకటించిన తేదీని మార్పు చేశారు. జూన్ 12న చంద్రబాబు విభజన ఆంధ్రప్రదేశ్లో మూడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.