అల్లూరి జిల్లా కొయ్యురు మండలం లో విత్తన మొలక శాతాన్ని పరిశీలించిన ఏవో ఉమాదేవి.
2024 ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన మండలానికి సరఫరా కాబడిన వివిధ రకాల విత్తనాల మొలక సాతాన్ని సోమవారం మండల వ్యవసాయ అధికారిని ఉమాదేవి పరిశీలించారు. ఈ మేరకు మండలంలోని చీడిపాలెం రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఆమె స్థానిక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉషా తో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. మండలానికి వచ్చిన వివిధ రకాల విత్తనాలు ఆర్ జి ఆర్ 2597. ఎం టీ యు 1064. ఎం టీ యు 1061. ఎం టీ యు 1318. ఎం టీ యు 1121. బి పి టీ 5204. ఆర్ ఆన్ ఆర్ 15048. మొదలగు విత్తనాల మొలక శాతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు ఉమాదేవి.