అల్లూరి జిల్లా గూడెం కొత్తవిధి మండలం జర్రేల గ్రామంలో విధులకు హాజరు కాని డాక్టర్ యొక్క కథనాన్ని BACK TO BACK NEWS CHANEL కు గ్రామస్తులు సంప్రదించగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా అడుగులు వేసిన ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ దుక్కేరి ప్రభాకర్ మరియు ఉత్తరాంధ్ర క్రైమ్ రిపోర్టర్ ఉమ మహేష్ కి ప్రత్యేక అభినందనలు. ఈ సంఘటనలో అల్లూరి జిల్లా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి స్పందించి జర్రెల గ్రామ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు విధులు నిర్వహిస్తూ సకాలంలో తన విధులకు రాకుండా ఉన్న ఇరువురి డాక్టర్లకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం తో పాటు, అధికారికంగా వివరణ ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. సకాలంలో స్పందించిన జిల్లా ఆరోగ్య వైద్యాధికారి వారికి బ్యాక్ టూ బ్యాక్ న్యూస్ ఛానెల్ ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది.
ఇకనైనా ప్రభుత్వ అధికారులు తమ వృత్తి నీ దైవంగా భావించి నిబద్ధతతో జవాబుదారీతనం తో చేస్తూ ప్రజల, మరియు ప్రభుత్వ మన్ననలు పొందుతారని ఆశిద్దాం.