నమ్మి మోసపోయమంటూ వాలంటీర్లు ఆవేదన

వైసిపి నాయకుల మాటలు నమ్మి మోసపోయమంటూ వాలంటీర్లు ఆవేదన.



అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలంలో రాజీనామా చేసిన వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జికే వీధిలో సమావేశమైన వాలంటీర్లు లో స్థానిక విలేకరులతో మాట్లాడారు. మన ప్రభుత్వమే వస్తుంది రాజీనామా చేసి ప్రచారం చేయాలని వైసిపి నేతలు చెప్పారని చెయ్యకపోతే బెదిరించి రాజీనామాలు చేయించారనే పేర్కొన్నారు. ఇప్పుడు ఆ నాయకులు కనిపించడం లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని  గూడెం కొత్త వీధి మండలంలో వాలంటీర్లు మీడియాకు తెలిపారు.