పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు “పోలీస్ గ్రీవెన్స్ డే” నిర్వహించిన జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.

 



పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపిఎస్ పోలీసు కార్యాలయంలో వినతులు స్వీకరించేందుకు ఈ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.ఈరోజు జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 8 మంది పోలీసు సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయం నందు హాజరు అయి, వారి యొక్క అనారోగ్య, ఉద్యోగ, వ్యక్తిగత సమస్యలను జిల్లా ఎస్పీ విన్నవించుకోగా, ఎస్పీ వారి విన్నపములను పరిశీలించి, సానుకూలంగా స్పందించి, అర్హమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ  ఎస్.విజయభాస్కర్ పాల్గొన్నారు.